కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రూ.50.40 లక్షల సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట: కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ శాసనసభ నియోజకవర్గ మొట్టమొదటి శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ చింతల్ సర్కిల్ పరిధిలోని రంగారెడ్డి నగర్ డివిజన్ గాంధీనగర్‌లో రూ.32 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి, వెంకట్రాంరెడ్డి నగర్లో రూ.18.40 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. తాను 2009 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా కొనసాగిన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ వ్యాప్తంగా పెద్దఎత్తున సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో నియోజకవర్గంలోని వివిధ కాలనీల్లో పెద్దఎత్తున సీసీ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రస్తుత ఎమ్మెల్యే పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ నియోజకవర్గంలోని కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి తగినన్ని నిధులు కేటాయించలేదని శ్రీశైలం గౌడ్ విమర్శించారు. ప్రజల మౌలిక అవసరాలను తీర్చడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
ఈ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడానికి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు కి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో నియోజకవర్గానికి మరింత పెద్దఎత్తున నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వంతో కలిసి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం కాలనీవాసులు, స్థానిక నాయకులు రోడ్ల నిర్మాణానికి కృషి చేసిన శ్రీశైలం గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు రమేష్ మంజూల్కర్, కాజా, మోతే శ్రీనివాస్, షాకీర్, తిమ్మయ్య, గంజాయి రాములు, సాయి గౌడ్, మల్లం శీను, పాషా, మోయిన్, తో పాటు కాలనీవాసులు కనకరాజు, విశ్వనాథ్, శ్రీనివాస్, ఆనంద్ రావు, నిర్మల రాజు తదితరులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
