భౌరంపేట్ శ్రీ శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి (బౌరమ్మగుడి) ఆలయాన్ని సందర్శించిన శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు….
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ సర్కిల్ భౌరంపేట్లోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి (భౌరమ్మగుడి) దేవాలయంలో జరుగుతున్న వార్షికోత్సవ కార్యక్రమాల్లో భాగంగా శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా స్వామివారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారిని దర్శించుకుకున్నారు. అనంతరం భక్తులను ఉద్దేశించి ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు. స్వామివారి సందేశంతో భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యం, భక్తిభావం వెల్లివిరిసింది.
ఈ సందర్భంగా భౌరంపేట్ మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్వామివారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, భక్తులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
