భౌరంపేట్ బంగారు మైసమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
సిఎంసి దుండిగల్ సర్కిల్ పరిధి భౌరంపేట్లోని శ్రీశ్రీశ్రీ బంగారు మైసమ్మ తల్లి బోనాల పండుగను పురస్కరించుకుని నిర్వహించిన పూజా కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎల్పీ విప్,ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ముఖ్య అతిథిగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే ప్రార్థించారు.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ని శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
