కుత్బుల్లాపూర్ రాజకీయ పితామహుడు బాపు K.M.పాండు 81వ జయంతి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి.
చింతల్ లో కుత్బుల్లాపూర్ రాజకీయ పితామహుడు బాపు K.M.పాండు 81వ జయంతి – ఎమ్మెల్యే K.P.వివేకానంద్ నివాళి
చింతల్ ప్రధాన రహదారి లోని స్వర్గీయ మహానేత, బాపు “K.M.పాండు” విగ్రహం వద్ద K.M.పాండు 81వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే K.P.వివేకానంద్ పాల్గొని తన తండ్రి అయిన K.M.పాండు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. మనుమడు విధాత్ వర్ధన్, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే K.P.వివేకానంద్ మాట్లాడుతూ “విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని నమ్మి, విద్యా వ్యాప్తికై కృషి చేసి ప్రతి ఇంట్లో జ్ఞానజ్యోతిని వెలిగించిన మహానేత K.M.పాండు . వారి ఆశయ సాధనలో భాగంగానే ఒకేషనల్ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది” అని అన్నారు.
“నాడు ఇందిరా గాంధీ ప్రభుత్వంలో కుత్బుల్లాపూర్ గ్రామ సర్పంచ్ గా ఉన్న K.M.పాండు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ అయిన ‘జీడిమెట్ల పారిశ్రామిక వాడ’ ను ఏర్పాటు చేయించి ప్రాంత అభివృద్ధికి బాటలు వేశారు. ఈ ఘనత K.M.పాండు కే దక్కుతుంది” అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో 292 సాయిబాబా నగర్ డివిజన్ BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్, రాజ్ కుమార్ ముదిరాజ్, తారా సింగ్, వేణు ముదిరాజ్, కిషోర్ ముదిరాజ్, లక్ష్మణ్ తదితరులు, వివిధ పార్టీల నాయకులు, K.M.పాండు అభిమానులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
