స్పందన హైస్కూల్ విద్యార్థులకు షీ టీమ్ అవగాహన సదస్సు….
విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి.. మహిళల భద్రతే షీ టీమ్ లక్ష్యం….
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి,రామగుండం/ : పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, షీ టీమ్ ఇన్చార్జ్ ఎస్ఐ లావణ్య ఆధ్వర్యంలో పెద్దపల్లి షీ టీమ్ సభ్యులు 8 ఇంక్లైన్ కాలనీలోని స్పందన హైస్కూల్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా షీ టీమ్ సభ్యురాలు స్నేహలత మాట్లాడుతూ విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, టీనేజ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండటం, పోక్సో చట్టం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సోషల్ మీడియా ప్రభావం, విద్యార్థుల ప్రవర్తనా నియమాలు, మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై వివరించారు.
మహిళలు, విద్యార్థుల భద్రత కోసం ప్రతిరోజూ బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు, జనసమ్మర్థ ప్రాంతాలు, కళాశాలల వద్ద షీ టీమ్ నిఘా ఉంటుందని తెలిపారు. ఎవరైనా వేధింపులకు గురైతే భయపడకుండా 6303923700 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని, ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
మహిళలకు ఏదైనా ప్రమాదం లేదా బెదిరింపులు ఎదురైతే వెంటనే 100/112కు, ఆన్లైన్ మోసాలకు గురైతే 1930కు ఫోన్ చేయాలని సూచించారు. ప్రయాణ సమయంలో మహిళల భద్రత కోసం టీ-సేఫ్ యాప్‌ను వినియోగించాలని తెలిపారు.
కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ రవీందర్ రావు, ఉపాధ్యాయులు, షీ టీమ్ సభ్యులు సురేష్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
