నారాయణ పాఠశాలలో ఆషాఢ బోనాల సంబరాలు.. పోతురాజు విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణ..
సాక్షిత : సూర్యాపేట జిల్లా కోదాడలోని నారాయణ పాఠశాలలో ఆషాఢ మాసం సందర్భంగా బోనాల పండుగను సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా విద్యార్థులు బోనాలు సమర్పించి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించారు.
ఈ సందర్భంగా పోతురాజు వేషధారణలో విద్యార్థులు చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. డప్పుల చప్పుళ్ల మధ్య బోనాల ఊరేగింపు ఉత్సాహంగా సాగింది. విద్యార్థులు తెలంగాణ జానపద సంస్కృతిని ప్రతిబింబించే నృత్య ప్రదర్శనలు ఇవ్వగా, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ, విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాలపై అవగాహన కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
