కొత్తవంగల్లు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
కొత్తవంగల్లు రూ 4.10 కోట్లతో అభివృద్ధి
ఇంటింటికి టిడిపి ప్రచారంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుండి కొడవలూరు మండలం కొత్త వంగల్లు పంచాయతీలోరు. 4.10 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు కొడవలూరు మండలం కొత్త వంగల్లు పంచాయతీలో ఇంటింటికి టిడిపి ప్రచారంలో ఆమె పాల్గొన్నారు ముందుగా గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ కొత్త వంగల్లు పంచాయతీలో ఎలక్షన్ క్యాంప్యాన్లో ప్రజలు తాగునీటి సమస్యల గురించి తమ దృష్టికి తీసుకొని వచ్చారని ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా జలజీవన్ మిషన్ ద్వారా రు.1.34 కోట్లతో తాగునీటి సమస్యకు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధి సమపాలంలో చేస్తున్నామని తెలిపారు. రీ సర్వేలో రైతుల భూమిని ప్రభుత్వ భూమిగా నమోదు చేశారని రైతులు విన్నవించారని దానినే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
