కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుంది కూకట్పల్లి ఎమ్మెల్యే తీరు ..
డబుల్ బెడఁరూం కేటాయింపుపై యాగీ ..యాగీ
పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం మాదే
కులం పేరు వాడుకునే దొర పోకడ మాకెరుకే ..
ఖమ్మం ఏమన్నా పాకిస్తాన్లో ఉందా !
రంగారెడ్డిజిల్లా ,కుత్బుల్లాపూర్ తెలంగాణాలో లేవా ..?
పేదలకు ఇళ్లిస్తే ఇంత కడుపుమంటా ..!
కూకట్పల్లి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి మరీ నవ్వులపాలయ్యారని కూకట్పల్లి కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు. 144 డబుల్ బెడఁరూం ల విషయంలో లావాదేవీలు,బేరసారాలు చేసింది ఎవరో కూకట్పల్లి ప్రజకు బాగా తెలుసన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నిజమైన పేదలను గుర్తించి ఇళ్ళు పంపిణి చేశామని,ఎక్కువశాతం ఇళ్ళు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన పేద లంబాడి కుటుంబాలకు దక్కిన విషయం ఎమ్మెల్యే కు తెలియదా అని ప్రశ్నించారు.కూకట్పల్లిలో తెలంగాణ లోని ప్రతి జిల్లా నుంచి ఉపాధికోసం అనేక మంది వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని.. వారిలో పేదల గుర్తించి రాష్ట్ర మంత్రులు రికమండేషన్ చేస్తే దాన్ని కూడా ఎమ్మెల్లే తట్టుకోలేక దొర బుద్ది చూపిస్తున్నారని దుయ్యబట్టారు.గత 10 ఏళ్లుగా ఎమ్మెల్యే చేసిన అక్రమాల చిట్టా రెడీ చేశామని, కూకట్పల్లిలో కాంగ్రెస్ హవా తట్టుకోలేకనే కృష్ణారావు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, వీటిని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
