మాటలు రాని యువతి పై అత్యాచార యత్నం కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలుశిక్ష జరిమానా విధించిన జిల్లా కోర్టు……….. జిల్లా ఎస్పీ సునీత రెడ్డి వెల్లడి
సాక్షిత వనపర్తి
వనపర్తి పట్టణంలోని రాయగడ్డ (బ్రాహ్మణ వీధి) కు చెందిన మాటలు రాని యువతీపై అత్యాచారం చేసిన కేసులో నేరం రుజువు కావడంతో నిందూతుడికి ఏడేళ్ల జైలు శిక్ష 61 వేల జరిమానా ను వనపర్తి జిల్లా కోర్టు విధించినట్లు జిల్లా ఎస్పీ సునీత రెడ్డి వెల్లడించారుఈ సందర్భంగా ఎస్పీ వివరాలను వెల్లడిస్తూ దాదాపుగా నాలుగు సంవత్సరాల క్రితం ( 29 – 10 2022) వనపర్తి పట్టణంలోని రాయగడ్డ (బ్రాహ్మణ) వీధిలో మాటలు రాని యువతి తన ఇంటిలో ఉండగా ఇంటిపక్కల వ్యక్తి అయినటువంటి గాడుదుల నాగశేషి అక్రమంగా ఇంటిలోకి ప్రవేశించి 18 సంవత్సరాల మాటలు రాని తన చెల్లెలిపై అత్యాచారయత్నం కి పాల్పడ్డాడని బాధితురాలు అన్న పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి టౌన్ ఎస్ఐ యుగంధర్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం జరిగిందని ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు ,అవసరమైన సాక్షాలు అన్నిఆదారాలను సేకరించి కోర్టులో ప్రవేశపెట్టడంతో వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భాకరాజు శ్రీనివాసరావు తీర్పును వెల్లడించడం జరిగిందని నిందితుడికి శిక్ష పడడంలో సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించిన పోలీస్ అధికారులకు పబ్లిక్ ప్రాస్కూటను ఎస్పీ అభినందించారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
