జగన్ 2.0 తో ప్రతి సామాన్యుడు కార్యకర్తకు భరోసా..
కోవూరులో జగన్ 2.0 యాప్ ను ఆవిష్కరించిన వైసీపీ నేతలు…
రాబోయే ఎన్నికలలో వైయస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా గెలుపొందడం తద్యమని కోవూరు మండలం వైసిపి పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సూచనల మేరకు కోవూరు మండల అధ్యక్షులు అత్తిపల్లి అనుప రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం కోవూరు వైసిపి నాయకులు, కార్యకర్తలతో, కలిసి జగన్ 2.0 యాప్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైసీపీ నాయకులను కార్యకర్తలపై వేధింపులు అక్రమ కేసులు బనాయిస్తుందన్నారు. ప్రతిపక్షం ప్రజల తరఫున గొంతు వినిపించకుండా అక్రమ చర్యలకు పాల్పడుతుందన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తే మాకు డిజిటల్ బుక్ రక్షణగా ఉందన్నారు. అదేవిధంగా ఈ జగన్ 2.0 యాప్ నాయకులు కార్యకర్తలపై జరిగే అన్యాయాలు అక్రమాలకు అండగా ఉంటుందన్నారు. సూపర్ సిక్స్ పేరుతో అన్ని బూటక వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసిన ఘనత కూటమి ప్రభుత్వంది అన్నారు.
ఈసారి జగన్ మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తే స్వర్ణ గ్రామాలు, సూపర్ పరిపాలన అన్ని సంక్షేమ పథకాలు యధావిధిగా అందుతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు వైసిపి మండల అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి,కోవూరునియోజకవర్గ పరిశీలకుడు కొండూరు అనిల్, ఏపీ డీఎల్ఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్, జిల్లా రైతు విభాగ అధ్యక్షులు శివుని నరసింహులు రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, నలుబోలు సుబ్బారెడ్డి, గాజుల మల్లికార్జునరావు, తోడేటి మహేష్, తురక భాస్కరరావు, గుణ్ణం జనార్ధన్, జెట్టి శ్రీనివాసులు రెడ్డి, షేక్ .జుబేర్ భాష, కూట్ల ఉమా శ్రీనివాసులు, మావులూరు శ్రీనివాసులు రెడ్డి, చిరంజీవి, సరాబు సుధీర్ కుమార్, నాలుగు మండలాల అధ్యక్షులు, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
