విద్యార్థులు సోషల్ మీడియా కు కనెక్ట్ అవ్వద్దు
ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తేవాలి..
విద్యార్థుల భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం అండగా ఉంది..
వసతి గృహాల విద్యార్థులకు కిడ్స్ పంపిణీలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి..
విద్యార్థులు చెడు వ్యసనాలకు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచించారు. కోవూరులోని సోషల్ వెల్ఫేర్ వసతి గృహాలలోని విద్యార్థినీ, విద్యార్థులకు, ప్రభుత్వం అందజేసే కిట్స్ ని అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థ కోసం విద్యార్థుల సంక్షేమ కోసం అనేక పథకాలు తీసుకొస్తున్నారని వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండి. తల్లిదండ్రులు, గురువులకు, పాఠశాలలకు మంచి పేరు తెచ్చి ఉన్నత స్థానానికి చేరాలని ఆమె సూచించారు.
అదేవిధంగా వసతి గృహాలలో పర్యావరణ పరిరక్షణతో పాటు పరిసరాల పరిశుభ్రత ముఖ్యమని సూచించారు. విద్యావ్యవస్థలో నూతన మార్పులు చేస్తూ ఒక క్లాస్ కి ఒక టీచర్, మధ్యాహ్నం సన్న బియ్యంతో నాణ్యమైన భోజనం వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నారని, వీటిని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ చదువుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, ఇంతా మల్లారెడ్డి, ఎంపీపీ తుమ్మల పార్వతి, జొన్నవాడ దేవస్థానం చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి, తాటిపర్తి విజయ్ కుమార్ రెడ్డి, కొల్లారెడ్డి సునీల్ రెడ్డి, షేక్. జమీర్, షేక్. జహంగీర్, పాలూరు వెంకటేశ్వర్లు, బీద భాస్కరరావు, పోలిశెట్టి సుబ్బారావు బిజెపి నాయకులు, అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు హాస్టల్ వార్డులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
