కార్మికుల సమస్యల పరిష్కారం కోసం
సింగరేణి లో ఆందోళనలకు సిద్దం కండి…
కార్మిక వర్గానికి రాజ్ కుమార్ పిలుపు….
సాక్షిత పెద్దపల్లి // సింగరేణి ని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆదుకుంటె తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు విపరీత రాజకీయ జోక్యం తో 51 వేల కోట్ల బకాయిలను పదమూడు సంవత్సరాలు దాటిన చెల్లించకుండా సంస్థ ను దివాలా తీయించారని, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
గురువారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించడం లో యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందినందున గుర్తింపు సంఘం ఏఐటియుసి ఆందోళన కార్యక్రమాలకు పిలుపు నిచ్చిందని అన్నారు.
సింగరేణి లో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి రెండు సంవత్సరాలు గడిచినా యాజమాన్యం కొన్ని సమస్యల ను స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో అంగీకరించి, ఇంత వరకు వాటిపై అమలు కోసం యాజమాన్యం సర్క్యులర్ లు జారీ చేయలేదని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యంగా మారుపేర్లు విజిలెన్స్ కేసుల సమస్య, సొంత ఇంటి పథకం, పెర్క్స్ పై ఇన్ కం టాక్స్ సమస్య, డిస్మిస్ కార్మికుల కు ఒక అవకాశం కల్పించాలని కోరడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తుందని కనుక ఏఐటియుసి ఈ నెల 17 నుండి 30 వరకు సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపు నివ్వడం జరిగిందని, కనుక జయప్రదం చేయాలని ఆయన కోరారు.
ఇంకా ఈ సమావేశంలో ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శులు మడ్డి ఎల్లా గౌడ్, వై.వి.రావు, కేంద్ర కార్యదర్శులు కవ్వంపల్లి స్వామి, కందుకూరి రాజారత్నం, జూపాక రాంచందర్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతం గోవర్ధన్, ఏఐటియుసి నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం ఎ గౌస్, ఆకునూరి శంకరయ్య, దాసరి శ్రీనివాస్, మిట్టపల్లి మొగిళి, దోరగండ్ల మల్లయ్య, ఏ.వి.ఎస్.ప్రకాశ్, వినయ్ కుమార్, దేవేందర్ రెడ్డి, ఏ.రవికుమార్, పడాల కనకరాజు, గంగారపు చంద్రయ్య, చెప్యాల మహేందర్ రావు, ఎజ్జ రాజయ్య, కలవల జగన్, ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
