ఉద్యోగ విరమణ పొందుతున్న
హోంగార్డుకు సీపీ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు….
సాక్షిత పెద్దపల్లి// పోలీస్ శాఖలో గత 41 సంవత్సరాలుగా హోంగార్డుగా పనిచేసిన
వి.సత్యనారాయణ (607), పెద్దపల్లి సబ్ యూనిట్‌కు చెందిన వారు. ఆయన రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ, కరీంనగర్లో కూడా విధులు నిర్వహించారు.
ఇట్టి హోంగార్డ్ ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వారి కార్యాలయంలో ఆయనకు పూలమాల వేసి,శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐ పెద్దన్న పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
