సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 10 రోజుల ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా,కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని గాజులరామారం సర్కిల్లో పోస్టర్ ఫ్రీ సైబరాబాద్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా షాపూర్ నగర్ ఎక్స్ రోడ్ నుండి సూరారం ఎక్స్ రోడ్ వరకు మరియు గాజులరామారం ప్రధాన రహదారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన రహదారుల వెంట, విద్యుత్ స్తంభాలపై మరియు ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన అనధికారిక పోస్టర్లను సిబ్బంది తొలగించడం జరిగింది. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడ౦ మరియు సుందరంగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం.ప్రజలు, వ్యాపారులు మరియు సంస్థల నిర్వాహకులు అనుమతులు లేకుండా అనధికారిక బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా మున్సిపల్ కార్పొరేష…


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST