ఘనంగా గాజులరామారంలో శ్రీశ్రీ కోటి దీపోత్సవం.. ముఖ్య అతిథిగా పాల్గొన్న కూన శ్రీనివాస్ గౌడ్

Sakshitha news

ఘనంగా గాజులరామారంలో శ్రీశ్రీ కోటి దీపోత్సవం.. ముఖ్య అతిథిగా పాల్గొన్న కూన శ్రీనివాస్ గౌడ్

గాజులరామారంలో శ్రీశ్రీశ్రీ నకులేశ్వరి దేవి సిద్ధి పీఠం ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.

!!ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేకేఎం ట్రస్ట్ చైర్మన్, మేడ్చల్–మల్కాజిగిరి డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ హాజరై కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు పొందారు!!.

కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో విశిష్టత ఉందని, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిభావాన్ని, ఐక్యతను పెంపొందించడంతో పాటు మన సంప్రదాయాలు, సంస్కృతిని భావితరాలకు అందిస్తాయని పేర్కొన్నారు. ఇంతటి ఘనమైన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు…

▪️అనంతరం కమిటీ సభ్యులు వారిని శాలువాతో సత్కరించారు

ఈ కార్యక్రమంలో కోటి దీపోత్సవ నిర్వాహకులతో పాటు స్థానిక నాయకులు బుచ్చిరెడ్డి, పున్నారెడ్డి, బాలప్ప, అంజి రెడ్డి, యం సాగర్,దంపబోయిన శ్రీనివాస్, రాజిరెడ్డి, గుబ్బల రమణ, సంతోష్ తదితరుల తొ పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.