బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత, ఉద్యమకారుడిగా, ప్రజాస్వామిక మానవతావాది ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతిని పురస్కరించుకుని ఆల్విన్ కాలనీ పద్మశాలి సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ లో నిర్వహించిన జయంతి వేడుకలలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి తాజా మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర మరువలేనిది. 1969లో తొలి దశ పోరాటంలోనే కీలక పాత్ర పోషించి, మంత్రి పదవిని కూడా త్వజించిన గొప్ప త్యాగశీలి అని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.
భారత స్వాతంత్ర పోరాటం, నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ కోసం ఇలా మూడు దశల ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించి దేశసేవకు అంకితమైన గొప్ప వ్యక్తి కొండాలక్ష్మణ్ బాపూజీ అని, దశాబ్దాల తెలంగాణ కల సాకారమైన వేల ఆ స్వప్నాన్ని మాత్రం ఆయన చూడలేక పోయారు. ఉద్యమాలతోపాటు ప్రజాప్రతినిధిగా నిరంతరం ప్రజాసేవ కోసం తపించిన గొప్ప దార్శనికుడు అని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.
స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి ప్రదాత, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు దిక్సూచిగా నిలిచిన కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన సొంత ఇంటిని సైతం ను త్యాగం చేసిన గొప్ప మహనీయుడు అని , బాపూజీ పోరాట స్ఫూర్తి, ప్రజాసేవా నిబద్ధత భావితరాలకు మార్గదర్శకమని ,ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శం అని, నేటి యువత ఆయన జీవితం స్ఫూర్తిదాయకం అని PAC చైర్మన్ గాంధీ కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు చిట్టిపోలు బిక్షమయ్య, ప్రధానకార్యదర్శి కోడూరి ప్రకాశ్, కోశాధికారి నరసింహ రాములు, ఉపాధ్యక్షులు జిల్లా గణేష్, పద్మశాలి సంఘం సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
