9వ వార్డులో పర్యటించి తుఫాన్ బాధితులను పరామర్శించిన మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు!

Sakshitha news

9వ వార్డులో పర్యటించి తుఫాన్ బాధితులను పరామర్శించిన మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు!

ప్రజలకు అండగా ఉంటాం.. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటాం!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నీటమునిగిన ప్రాంతాలను అశ్వరావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు పరిశీలించారు.

గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా 9వ వార్డులోని పలు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు జలమయమై ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా నందమూరి నగర్, మెరుపు కాలనీ, జలగం నగర్ ప్రాంతాల్లో పర్యటించి తుఫాన్ ప్రభావిత బాధితులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడిన జూపల్లి రమేష్ బాబు, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ కష్ట సమయంలో ప్రజలకు అండగా ఉంటానని, ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం సంబంధిత మున్సిపల్ అధికారులతో మాట్లాడి వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, వర్షపు నీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో 9వ వార్డు కౌన్సిలర్ కారం కనకదుర్గ, అశ్వరావుపేట మండల కాంగ్రెస్ నాయకులు జూపల్లి ప్రమోద్, నక్క సత్యనారాయణ, 10వ వార్డు హ్యాట్రిక్ కౌన్సిలర్ మిండా హరిబాబు, మునుకోటి శ్రీనివాసరావు, షేక్ యాకూబ్, వంగవీటి జాన్ పాల్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ప్రజా సమస్యలే ప్రథమ ప్రాధాన్యం.. ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవడమే లక్ష్యం!