బౌరంపేట్ శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణం మరియు మల్లన్న స్వామి కల్యాణోత్సవ ప్రత్యేక పూజలో పాల్గొన్న నర్సారెడ్డి భూపతి రెడ్డి .
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం బౌరంపేట్ డివిజన్ లోని మల్లన్న స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా జరుపుకునే కళ్యాణోత్సవంలో ఆలయ కమిటీ ప్రత్యేక ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమంలో పాల్గొని రేణుక ఎల్లమ్మ మరియు మల్లన్న స్వామి ఆశీస్సులు పొందిన మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి .
ఈ సందర్భంగా భూపతి రెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లగా బౌరంపేట్ గ్రామంలో ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ కళ్యాణోత్సవానికి ఎంతో ప్రసిద్ధి ఉందని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు తమ మొక్కలను చెల్లించుకొని నియమనిష్టలతో దేవుని దర్శించుకుంటారని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు రాజకీయాలకతీతంగా ఈ జాతరను ముందుకు నడుపుతూ వస్తున్నారని జాతరకు 20వేలకు పైగా భక్తులు పాల్గొంటారని, భక్తులకు అమ్మవారి కృప కటాక్షాలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు చేకూర్చాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పద్మా రెడ్డి, కుత్బుల్లాపూర్ యువ నాయకులు నర్సారెడ్డి తేజ రెడ్డి(NTR), బౌరంపేట్ మాజీ సర్పంచ్ మిద్దిల యాదిరెడ్డి, సీనియర్ నాయకులు విజయ్ గౌడ్, పోచి మహేష్, సురేష్, మల్లేష్ యాదవ్, విజయ్ కుమార్, భరత్ గౌడ్, అరుణ్ రెడ్డి మరియు ఆలయ కమిటీ సభ్యులు, బౌరంపేట్ గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY