చిలుకూరులో భీమ్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన
పేద కుటుంబానికి స్వేరోస్ నెట్‌వర్క్ అండ
సూర్యాపేట జిల్లా/చిలుకూరు, సాక్షిత :
చిలుకూరు మండల కేంద్రంలోని జగ్జీవన్ రామ్ నగర్ కాలనీలో స్వేరోస్ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో కందుకూరి గురువయ్య కుటుంబానికి నిర్మించనున్న భీమ్ హౌస్ నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్వేరోస్ నెట్‌వర్క్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరై భీమ్ హౌస్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పేద కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు వారి నివాస అవసరాలను తీర్చేందుకు స్వేరోస్ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు బత్తిని వీరయ్య, జిల్లా అధ్యక్షుడు పిడమర్తి దశరథ, జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లపల్లి శివకృష్ణ, జిల్లా ఈసీ సభ్యుడు కందుకూరి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
