ప్రమాణ స్వీకారం చేయడం సులువే- ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి.

Sakshitha news

ప్రమాణ స్వీకారం చేయడం సులువే- ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి.

ఏఎంసీ కమిటీ కలిసికట్టుగా పరిష్కరించాలి రైతు సమస్యలను.

ఏఎంసి కోవూరు కి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు చలవే.

ఏఎంసి అభినందన సభలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి..

ఏ పదవికైనా ప్రమాణ స్వీకారం చేయడం సులువేనని కానీ ఆ పదవిని బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం ఆదివారం కోవూరు ఏఎంసీ మార్కెటింగ్ కమిటీ అభినందన సభలో ఎమ్మెల్సీ వేద రవిచంద్ర ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో కలిసి ఎంపీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా యల్లయ్యపాళెం ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి ఏఎంసీ మార్కెట్ యాడ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ముందుగా ఏఎంసీ చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డికి అభినందనలు తెలిపారు. అనంతరం రైతుల సమస్యలు ఏఎంసి కమిటీ సభ్యులు కలిసికట్టుగా పనిచేసే పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు.

అనంతరం “ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి” మాట్లాడుతూ.. రైతులకు అండగా ఉంటామని ఏఎంసి కమిటీ ద్వారా రైతుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. ఏఎంసీ కమిటీ కూటమి కమిటీ అన్నారు గతంలో ఏఎంసీ కమిటీ ఎలా జరిగిందో అందరికీ తెలుసు అని అన్నారు. ప్రస్తుత ఏఎంసీ కమిటీ అవినీతికి తావు లేకుండా సక్రమంగా నియమించామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, రైతులు, ప్రజలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top