ప్రతి పౌరుడికి ఆధార్ అందేలా చర్యలు…
- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష….
- సాక్షిత పెద్దపల్లి:
- గోదావరిఖని ప్రతి పౌరుడికి ఆధార్ అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఆధార్ అప్ డేట్ పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివి ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలని, ఆధార్ కార్డు ఉన్న విద్యార్థులకు అవి అప్డేట్ అయి ఉండాలని కలెక్టర్ తెలిపారు. రాబోయే రోజులో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో పర్యటించి ఆధార్ కార్డు ప్రతి విద్యార్థికి అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలోని ప్రతి పౌరుడు కి ఆధార్ కార్డు అందేలా చర్యలు తీసుకోవాలని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆధార్ లేకుండా ఎవరు ఉండటానికి వీలు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆధార్ కార్డు లేని వ్యక్తులను గుర్తించి వారికి నూతన ఆధార్ కార్డు జారీ చేయడంతో పాటు ఆధార్ కార్డు సవరణ, అప్ డేట్ కూడా ఎప్పటికప్పుడు జరిగేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.
ఈ సమావేశంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY