మహాత్ముడి అహింసా మార్గంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్ర సాధకులు కెసిఆర్ : బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….
జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు నగరంలోని తెలంగాణ భవన్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలు వేసి అంజలి ఘటించి ఒక నిమిషం మౌనం పాటించారు.
అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ….
జాతిపిత మహాత్మా గాంధీ సూచించిన శాంతి, అహింస మార్గాల స్ఫూర్తితో 13 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకులు కేసీఆర్ .
గాంధీ సూచించిన శాంతి, అహింస మార్గాలను అనుసరించి దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా, అమెరికాలో సర్ మార్టిన్ లూథర్ కింగ్ అక్కడ స్వేచ్ఛాయుత వాతావరణాన్ని అందించడంలో సఫలీకృతమయ్యారు.
అందరూ మహాత్మా గాంధీ సూచించిన శాంతి, అహింస మార్గాల ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY