మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ …
జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతిని పురస్కరించు హనుమకొండ డిసిసి భవనంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తో కలిసి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ …
ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ఆ మహాత్మా గాంధీ భారతదేశానికి స్వాతంత్రం రావడంలో తాను పోషించి పాత్ర అమోఘమని కొనియాడారు, మహాత్మా గాంధీ భారతదేశానికి ఒక స్ఫూర్తిదాయకం అని తెలియజేశారు.
అనంతరం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సర్వోదయ చరక సంఘటన కార్యక్రమాలలో ఇన్చార్జ్ మీనాక్షి నటరాజ్ తో కలిసి పాల్గొన్నారు..
ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ శాసనసభ్యులు నాయిని రాజేందర్, కె ఆర్ నాగరాజు, హనుమకొండ మరియు వరంగల్ జిల్లా అధ్యక్షులు వెంకట్ రెడ్డి , అయూబ్ ఇతర కాంగ్రెస్ ముఖ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY