బీజేపీ మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదాం…
ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కే జ్యోతీ పిలుపు….
సాక్షిత పెద్దపల్లి : ఎన్టిపీసి శ్రామిక మహిళల ఉపాధి పై మోడీ ప్రభుత్వం జరుపుతున్న దాడికి వ్యతిరేకంగా మార్చి 1నుండి 8 వరకు జరుగు అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం విజయవంతం చేయాలని ఎన్ టి పి సి లో సెంటర్లలో వాల్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం (పి.ఓ.డబ్ల్యూ) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కే జ్యోతీ పాల్గొని మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం శ్రామిక వర్గ మహిళల పై పనిభారాన్ని మోపుతూ, వారి శ్రమను దోచుకునేందుకు అదనపు పని గంటలు పెంచుతూ, కార్పొరేట్లకు ఊడిగం చేసే విధానాలను అమలు చేస్తున్నారని అన్నారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్చి, బడ్జెట్లో కోతలు విధిస్తూ క్రమంగా ఆ పథకాన్ని రద్దు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఇది 26 లక్షల కోట్ల ఉపాధి జాబ్ హోల్డర్లకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు, ఉపాధి కల్పించేందుకు ఈ పథకాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఉపాధి హామీ పథకంలో అత్యధికంగా పని దొరికేది మహిళలకు, దళిత, ఆదివాసి, గిరిజనులకు మాత్రమేనని ఆ చట్టాన్ని రద్దు చేస్తే ఆ సామాజిక వర్గ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని విమర్శించారు.
పేరు మార్చిన ఈ పథకానికి 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రాలు ఖర్చులు భరించాలని వారు డిమాండ్ చేశారు, అంతేకాకుండా దేశవ్యాప్తంగా మహిళలకు జరుగుతున్న హింసలకు వ్యతిరేకంగా పోరాడాలని, “మార్చి 8 అంతర్జాతీయ ప్రామిక మహిళా దినోత్సవం” సందర్భంగా జరిగే సభలు సమావేశాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీ పీ ఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు చిలుక. శంకర్, పిఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు కే. సమ్మక్క, సరోజన ,సరూప, సూర్యావతి, వెంకటమ్మ, పుష్ప , ఓదమ్మ, సంధ్య, సరస్వతి, రాజామణి, రాజేశ్వరి, శంకరమ్మ, సుశీల, పోచమ్మ తో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY