ఇరాన్లో భూకంపం
ఇరాన్లో భూకంపం
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ, ఇరాన్‌లోని గెరాష్ నగరం కేంద్రంగా మధ్యాహ్నం రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూ అంతర్భాగంలో 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. అమెరికా, ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ విపత్తు సంభవించింది. భూకంపం వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
