నల్లపరెడ్డి జగన్‌మోహన్‌రెడ్డిని పరామర్శించిన వేమిరెడ్డి దంపతులు
టిడిపి సీనియర్ నాయకులు, నెల్లూరు సెంట్రల్ బ్యాంక్ మాజీ వైస్ ఛైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డిని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు పరామర్శించారు. ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురైన జగన్మోహన్ రెడ్డికి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ఆపరేషన్ అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆయన.. ప్రస్తుతం నెల్లూరులోని తన కుమార్తె నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వారి ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో కోడూరు కమలాకర్‌రెడ్డి, కోట మాజీ ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY