తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూతులపాటి భౌతిక కాయానికి ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) నివాళి
నూతులపాటి మరణం టిడిపికి తీరని లోటు : ఎంపీ కేశినేని శివనాథ్
విజయవాడ: తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , టి.ఎన్.ఎస్.ఎఫ్ ఉమ్మడి కృష్ణా జిల్లా మాజీ అధ్యక్షుడు నూతులపాటి నాగభూషణం భౌతిక కాయానికి ఎంపీ కేశినేని శివనాథ్ టిడిపి నాయకులతో కలిసి నివాళులర్పించారు. పటమటలంక లోని బృందావన్ అపార్ట్మెంట్స్ లో నూతులపాటి నాగభూషణం భౌతిక కాయానికి ఉదయం ఎంపీ కేశినేని శివనాథ్ సందర్శించి ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకురాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నాగభూషణం పార్టీ కి చేసిన సేవలను గుర్తు చేశారు. పార్టీ అండగా వుంటుందని కుటుంబ సభ్యులకి భరోసా ఇచ్చారు.
నూతులపాటి నాగభూషణంకు నివాళులర్పించిన వారిలో ఏపీ బిల్డింగ్ అదర్ కనస్ట్రక్షన్ వర్కర్స్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ సజ్జా అజేయ్, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ, టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్, టి.ఎన్.ఎస్.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి లతో పాటు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
