టాస్క్ సెంటర్ ను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి….
ఉచిత శిక్షణ దరఖాస్తుల స్వీకరణ
-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష…
సాక్షిత పెద్దపల్లి/ పెద్దపల్లి రీజినల్ టాస్క్ సెంటర్ ను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో టాస్క్ రీజనల్ సెంటర్ ఉచితంగా పలు టెక్నికల్ కోర్సుల్లో శిక్షణ ఇస్తోందని, ఆర్టిసి బస్ డిపో కార్యాలయ ప్రాంగణంలో ఉన్న టాస్క్ సెంటర్లో ఈ శిక్షణ కార్యక్రమాలు అందిస్తామన్నారు.
జావా వెబ్ డెవలప్మెంట్, పైథాన్, సీ, సీ++, హెచ్టిఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, టాలీ విత్ జీఎస్టీ, మెడికల్ కోడింగ్ & బిల్లింగ్, ఆప్టిట్యూడ్, రీజనింగ్, సాఫ్ట్ స్కిల్స్ వంటి ముఖ్యమైన కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని,
టాస్క్ సెంటర్లో శిక్షణ పొందిన వారికి మంచి జీతాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 28 లోపు టాస్క్ సెంటర్లో పేరు నమోదు చేసుకోవాలని మరింత సమాచారం కోసం 90595 06807 నంబర్లో సంప్రదించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
