తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సుష్మా స్వరాజ్
పెద్దమ్మ పాత్ర.
గద్వాల్ సాక్షిత:
తెలంగాణ రావడానికి ప్రధాన కారణం కేంద్ర మంత్రి అయిన చిన్నమ్మ దిగవంగత సుష్మా స్వరాజ్ అని, తెలంగాణ రావడానికి అమోఘమైన కృషి చేసిందని జోగులాంబ గద్వాల జిల్లా బిజెపి మాజీ అధ్యక్షులు రామచంద్ర రెడ్డి అన్నారు.
ఆనాడు తెలంగాణ రాకపోవడానికి కారణం, కాంగ్రెస్ పార్టీ నాన్చుడు ధోరణి అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుల మొండి వైఖరి వల్ల, వందలాది మంది ఎంతోమంది విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేయవలసి వచ్చిందని, గుర్తు చేశారు.
జై తెలంగాణ అన్న వారందరినీ, అరెస్టులు చేసి లాటి చార్జీలు చేసిందని, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, వీరందరినీ తెలంగాణ ద్రోహులు గా చిత్రీకరించి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ద్రోహం చేసిందని రామచంద్ర రెడ్డి అన్నారు. బిజెపి పార్టీ, ఎజెండా చిన్న రాష్ట్రాలని మొదటి నుండి చిన్న రాష్ట్రాలకు అనుకూలమని, అందుకు ఉదాహరణ చత్తీస్గడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, రాష్ట్రాలను ఏర్పాటు చేయడమైనది. తెలంగాణ వచ్చిన తర్వాత బి ఆర్ ఎస్ పార్టీ కుటుంబ పార్టీగా అవతరించి, తెలంగాణ వరులను దోచుకుందని ఆరోపించారు. ఎంతోమంది ఉద్యమకారుల విద్యార్థుల బలిదానాల వల్ల తెలంగాణ ఏర్పాటు జరిగిందని, బిజెపి పార్టీ చిన్నమ్మ అయినా సుష్మా స్వరాజ్ ఢిల్లీలో మిగతా పార్టీల ఎంపీల అందరినీ కూడగట్టుకుని తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
చరిత్రను ఎవరు మార్చలేరని ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా రామచంద్ర రెడ్డి అన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY