ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కళ నెరవేరుతుంది.
కాంగ్రెస్ పార్టీ నాయకులు సిరాజ్.
జోగులాంబ గద్వాల జిల్లా సాక్షిత : పేదల మొహంలో చిరునవ్వు చూడటమే మా ప్రజా ప్రభుత్వ ద్వేయం.
ఇచ్చిన మాట నెరవేర్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.
అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు మండల పరిధిలోని అమరవాయి గ్రామానికి చెందిన ఒంటరి మహిళ లబ్ధిదారిని మాల ఇకమని ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం నుంచి కేటాయించిన ₹5 లక్షల ఆర్థిక సహాయంతో తమ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఆ నివాసానికి శుక్రవారం రోజున కొత్త ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యతిధిగా పాల్గొని గృహ ప్రవేశం చేసి వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలపడం జరిగినది.
అనంతరం ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేసిన మాల ఇకమని కి నూతన వస్త్రాలు పెట్టి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు..ఈ సందర్భంగా సిరాజ్ మాట్లాడుతూ,
“ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుతోంది. పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. పేదల ముఖంలో చిరునవ్వు చూడటమే ప్రజా ప్రభుత్వ ద్వేయం” అని పేర్కొన్నారు..
గత పాలకులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అని చెప్పి పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు నిజమైన న్యాయం జరుగుతోందని స్పష్టం చేశారు..
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మంది పేదలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని సిరాజ్ ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY