సీఎం సురేష్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరణ
అలంపూర్ సాక్షిత :
ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సి.ఎం. సురేష్.
అలంపూర్ తాలూకా ఐజ మున్సిపాలిటీలో చైర్మన్ మరియు కౌన్సిలర్లు, కొలువు తీరారు.
వేద పండితుల పూర్ణకుంభ స్వాగతం మరియు ప్రత్యేక పూజల మధ్య బాధ్యతల స్వీకరణ.
మున్సిపల్ కమిషనర్ సైదులు, మేనేజర్ అశోక్ రెడ్డి, మరియు మున్సిపల్ సిబ్బంది సమక్షంలో జరిగిన ఈ అద్భుత పట్టాభిషేక మహోత్సవం ఎంతో కన్నుల పండుగగా సాగింది. వైస్ ఛైర్మన్ మాల నరసింహులు తో కలిసి కౌన్సిలర్లు,బాధ్యతలు చేపట్టడం పట్ల అభిమానులు, కార్యకర్తలు ఎంతో హర్షం వ్యక్తం చేశారు.
కార్యకర్తలు, అభిమానుల కోలాహలం మధ్య వైభవంగా సాగిన బాధ్యతల స్వీకరణ.
మన పట్టణం మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలందరికీ మెరుగైన సేవలు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నమని పెద్దలు , ప్రజలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ వార్డుల కౌన్సిలర్ లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY