కుల మత ప్రాంతాలకు అతీతం శివాజీ తత్వమని టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బాలానగర్ కు చెందిన జై శ్రీరామ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బాలనగర్ చౌరస్తా వద్ద నూతనంగా శివాజీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ కార్యక్రమానికి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శివాజీ అనంతర కాలంలో ధర్మం కోసం జరిగిన పోరాటాలకు ఆయన స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. భారతదేశ చరిత్రలో హిందూ ధర్మ పరిరక్షణ కోసం చత్రపతి శివాజీ చేసిన ధైర్యం పోరాటం సాహసం నేటి యువతకు స్ఫూర్తిగా కొనసాగుతున్నాయన్నారు. అన్నసంతర్పణ నిర్వహించారు. నిర్వాహకులను రమేష్ అభినందించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, పులి శివకుమార్ గౌడ్, మాదిరెడ్డి యుగేందర్ రెడ్డి, ఆకుల నరేందర్ ముదిరాజ్, పుష్ప రెడ్డి,పులి శ్రీకాంత్ పటేల్, గోపిశెట్టి రాఘవేందర్, సతీష్ గౌడ్, శివ చౌదరి, మరియు జై శ్రీరామ్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY