గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళ మాధవిని కలిసిన అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ నేతలు
గుంటూరు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళ మాధవి ని గుంటూరు లోని ఆమె నివాసంలో అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు నేతృత్వంలో గుంటూరులోని ఎమ్మెల్యే నివాసంలో కలిశారు ఈ సందర్భంగా అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, మహిళా నాయకులు ఎమ్మెల్యే గళ్ళ మాధవి ని పుష్పగుచ్ఛాలతో అభినందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కొల్లూరి ఇమ్మానియేలు,అవనిగడ్డ మోపిదేవి మాజీ ఎంపీపీలు బండే కనకదుర్గ, మోర్ల జయలక్ష్మి పార్టీ నేతలు విశ్వనాథపల్లి పాప, మండలి రామమోహనరావు, అన్నపరెడ్డి వెంకటేశ్వరమ్మ, ఆంగోతు శాంతి, ఆకుల సీతామహాలక్ష్మి, కొల్లూరి వాసు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY