భాగవతుల జయలక్ష్మికి ఘన సత్కారం
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: స్థానిక అంకాల పరమేశ్వరి ఆలయ పాలకమండలి సభ్యురాలుగా నియమితులైన తిరుపతికి చెందిన భాగవతుల జయలక్ష్మికి ఘన సత్కారం లభించింది. కళాకారులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, టిడిపి టీఎన్ టీయూసీ తిరుపతి అధ్యక్షులు కస్పా పద్మనాభం ఆధ్వర్యంలో పలువురు కళాకారులు భాగవతుల జయలక్ష్మిని దుస్సాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. అంకాల పరమేశ్వరి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అమ్మవారి ఆశీస్సులతో మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, లోక ప్రభాకర్ నాయుడు, పోలే జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY