శ్రీకాళహస్తీశునికి కాణిపాకం పట్టువస్త్రాలు
సాక్షిత ప్రతినిధి – తిరుపతి / పూతలపట్టు: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మధ్యాహ్నం శ్రీ జ్ఞాన ప్రసునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వార్లకు స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానము వారిచే పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో కాణిపాకం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ సురేష్ బాబు (మణి నాయుడు), సభ్యులు, కాణిపాకం ఆలయ ఈఓ పెంచల కిషోర్, ఏఈవో ధనపాల్, పర్యవేక్షకులు కోదండం, వేద పండితులు, సిబ్బంది, శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, సభ్యులు, ఆలయ ఈఓ బాపిరెడ్డి, డీఈఓ కృష్ణారెడ్డి, ఆలయ ఏఈవో విద్యాసాగర్ రెడ్డి ప్రోటోకాల్ ఏఈవో మోహన్, ఆలయ ఇన్స్పెక్టర్ సుదర్శన్, పీఆర్వో రవి, సిబ్బంది పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY