జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కి వినతి పత్రం….. *ఈద్గాల వద్ద వసతులు కల్పించాలి…
జిల్లా వక్ఫ్ బోర్డు మెంబర్ ఎస్. దాని..
సాక్షిత:
రంజాన్ పండుగను పురస్కరించుకుని కోదాడ నియోజక వర్గంలోని మసీదులు, ఈద్గాలు మరియు ముస్లిం శ్మశానవాటికల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా వక్ఫ్ బోర్డు సభ్యులు ఎస్. దాని కోరారు. సూర్యాపేటలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి టి. నర్సింహులును కలిసి వినతి పత్రం అందజేశారు. కోదాడ పట్టణంతో పాటు మండల, గ్రామ స్థాయిల్లోని ప్రార్థనా స్థలాల వద్ద తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం వంటి ఏర్పాట్లు చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ సామాజిక కార్యకర్త ఎండి మజహార్ పాల్గొన్నారు. వినతిపై సానుకూలంగా స్పందించిన అధికారి తక్షణమే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY