మీడియా ప్రతినిధులకు 2026-28 కొత్తగా అక్రిడేషన్ జారీ కొరకు జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ ఏర్పాటుకు చర్యలు – జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
సాక్షిత వనపర్తి ఫిబ్రవరి 17
వనపర్తి జిల్లాలోని మీడియా ప్రతినిధులకు 2026-28 సంవత్సరాలకు కొత్త అక్రిడేషన్ ల జారీ కొరకు నూతన జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి నేడొక ప్రకటనలో తెలిపారు.
జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీలో సభ్యత్వం పొందేందుకు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 252 ప్రకారం జిల్లాలోని మీడియా అసోసియేషన్లు, సంఘాలు తమ ప్రతినిధి పేరును లెటర్ ప్యాడ్ పై రాసి ఫిబ్రవరి, 19 లోపు జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
1. బిగ్ తెలుగు డైలీ నుండి ఒక ప్రతినిధి.
2. ఉర్దూ డైలీ నుండి ఒక ప్రతినిధి
3. మీడియం డైలీ నుండి ఒక ప్రతినిధి
4. స్మాల్ డైలీ నుండి ఒక ప్రతినిధి
5. ఎలక్ట్రానిక్ మీడియా నుండి ఒక ప్రతినిధి
6. వీడియో జర్నలిస్ట్ నుండి ఒక ప్రతినిధి
7. ఫోటో జర్నలిస్ట్ నుండి ఒక ప్రతినిధి.
పై సూచించిన ప్రతినిధులు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 252 లోని రూల్ 3, సబ్ రూల్ 1(సి) ప్రకారం ఫుల్ టైం జర్నలిస్ట్ అయి ఉండాలి. అదే విధంగా బిగ్ డైలీ ప్రతినిధి, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధికి 10 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి, మిగిలిన ప్రతినిధులకు కనీసం 5 సంవత్సరాల మీడియా రంగంలో అనుభవం కలిగి ఉండాలి. నిబంధనల ప్రకారం జిల్లాలోని అసోసియేషన్ లు, సంఘాలు తమ ప్రతినిధుల పేర్లను ఫిబ్రవరి, 19 సాయంత్రం 5 గంటల లోపు జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. గడువు తర్వాత వచ్చిన ఎలాంటి ప్రతిపాదనలు ఎట్టిపరిస్థితుల్లోనూ స్వీకరించబడవని తెలియజేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY