టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి….బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ నయీమ్
సాక్షిత :
టిఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం.హనుమా నాయక్ ను అధిక మెజారిటీతో గెలిపించండి.
కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీ నగర్ 7వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి హనుమానాయక్ గెలుపును కాంక్షిస్తూ పట్టణ అధ్యక్షుడు షేక్ నయీమ్ అవార్డులో ముమ్మర ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ ఓటర్లను హనుమానాయక్ కు ఓటు వేసి ఆశీర్వదించవలసిందిగా కోరారు.
అదేవిధంగా పట్టణంలోని 26వ వార్డు అభ్యర్థి కుక్కడపు సువర్ణాదేవి,వెంకటేశ్వర్లు గెలుపును కోరుతూ వార్డులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాక్షేమమే విస్మరించిందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, కారు గుర్తుకు ఓటు వేసి హనుమానాయక్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పట్టణం, వార్డు అభివృద్ధి బిఆర్ఎస్‌తోనే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY