ప్రణాళిక బద్ధంగా పాఠశాల అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి…
- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష….
సాక్షిత పెద్దపల్లి : ప్రణాళిక బద్ధంగా పాఠశాల అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష తెలిపారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పాఠశాలలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వస్తువుల కల్పన కొరకు చేపట్టిన పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వర్షా కాలం లోపు గ్రౌండ్ లెవెలింగ్ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో కంప్యూటర్ ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, 40 లక్షలతో డ్యూయల్ డెస్క్ కొనుగోలు చేశామని, వీటిని విద్యార్థుల సంఖ్య ఆధారంగా సంబంధిత కెజిబీవీ, ఆదర్శ పాఠశాలలకు కేటాయించాలని కలెక్టర్ ఆదేశించారు.కేజీబీవీ లో కిచెన్ ఆధునికరణ కోసం 20 లక్షల మంజూరు చేశామని అన్నారు.
పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి ఆధారంగా బిల్లులు విడుదల చేయడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. సింగరేణి ప్రభుత్వ గ్రామాలలోని పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో సిపిఓ రవీందర్, డి సి హెచ్ ఓ శ్రీధర్, సమగ్ర శిక్ష జిల్లా సమన్వయకర్త పిఎం షేక్, ప్లానింగ్ సెక్టోరియల్ ఆఫీసర్ మల్లేష్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY