మాటకు కట్టుబడి, కార్పొరేటర్ గా వచ్చిన మరుసటి రోజు నుండే అభివృద్ధి పై ముందుకు దూసుకు పోతున్న.. ధూళి కట్ట….
సాక్షిత పెద్దపల్లి ; గోదావరిఖని 50వ. డివిజన్‌లోని గాంధీ నగర్ ప్రాంతంలో ఆదర్శ యూత్ పక్క గల్లీలో రోజులుగా నిండిపోయి, ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న చెత్త కుండీలను ప్రమాణ స్వీకారోత్సవం మరుసటి రోజు నుండే ఉదయం మున్సిపల్ శానిటేషన్ సిబ్బందిచే పూర్తిగా శుభ్రం చేయించడం జరిగింది.
ఈ సందర్భంగా ధూళి కట్ట సతీష్ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత నా ప్రథమ ప్రాధాన్యత ఆని, సమస్య ఎక్కడ ఉన్నా వెంటనే స్పందించి పరిష్కారం చూపడం నా బాధ్యతగా భావిస్తున్నాను ఆని, ఇలా ప్రతి గల్లీ పరిశుభ్రంగా, ప్రతి ఇల్లు సంతోషంగా ఉండేలా నిరంతరం కృషి చేస్తాను ఆని తెలిపారు. నేటి యువత రేపటి భవిష్యత్తు అన్న తీరులో నడుస్తున్న ఈ యువ కిరీటం మునుముందు ఇతను చేసే అభివృద్ధి ఎలా ఉండ పోతుందో చూడాలి అని కొందరి అభిప్రాయం

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY