ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు.
అలంపూర్ సాక్షిత :
ఐజ మున్సిపల్ చైర్మన్ సీఎం సురేష్ ఆధ్వర్యంలో ఐజ పట్టణంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిపారు.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, అభివృద్ధి ప్రదాత
కె. చంద్రశేఖర్ రావు, జన్మదిన వేడుకలు ఐజ పట్టణ మున్సిపల్ చైర్మన్ సీఎం సురేష్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ సీఎం సురేష్ మాట్లాడుతూ,
కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరువయ్యాయని కొనియాడారు. కేసీఆర్ దార్శనికతతో కూడిన పరిపాలన కోసం నేడు ప్రజలందరూ మళ్ళీ ఎదురుచూస్తున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు .
టిఆర్ఎస్ నాయకులు 2కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ వేడుకల్లో బి అర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకటరాములు , మున్సిపల్ వైస్ చైర్మన్ మాల నరసింహులు, సీనియర్ నాయకులు మల్లికార్జున రెడ్డి, పల్లయ్య , మాస్టర్ మధు, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
వార్డు కౌన్సిలర్లు తిరుమలేష్ , రజాక్ , మహేశ్వరి వెంకన్న గౌడ్ , సరోజ పెద్దయ్య, ఎరుకలి శివ , డాక్టర్ కృష్ణ, నరసమ్మ రఘు , మరియు మున్సిపల్ మాజీ చైర్మన్ రాజేశ్వరి ఏలియాజర, పాల్గొన్నారు.
అలాగే మున్సిపల్ చైర్మన్ సీఎం సురేష్ మిత్ర బృందం, బి అర్ ఎస్ పార్టీ నాయకులు, విద్యార్థి, యువజన నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ జన్మదిన వేడుకలను జయప్రదం చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY