రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్,డిప్యూటీ మేయర్ ఎన్నికకు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు…
సాక్షిత పెద్దపల్లి ; రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్‌లు కలిసి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తును పరిశీలించారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేలా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సమగ్ర బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అలాగే జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లో కూడా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఈ బందోబస్తులో గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్, గోదావరిఖని టూటౌన్ సీఐ ప్రసాద్, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY