రామలింగేశ్వర ఆలయంలో అన్నదానం
** బీజేపీ రాష్ట్ర నేత గుండాల గోపినాధ్ హాజరు
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తిరుచానూరు సమీపంలోని ముండ్లపూడి గ్రామంలో వెలసిన
శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి కార్యక్రమాలు రెండు రోజులపాటు ఆలయ చైర్మన్ దొడ్డారెడ్డి మనోహర్ రెడ్డి నేతృత్వంలో ఘనంగా జరిగాయి. ఇందులో గ్రామీణ జానపద కళలు, కోలాటాలు పలువురిని ఆకర్షించింది. అలాగే జానపద నృత్యాలు, భక్తి పాటలు గ్రామస్తులను ఆకర్షించాయి. స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరిగాయి. ప్రతియేట మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం చైర్మన్ అండ్ బీజేపీ రాష్ట్ర నేత గుండాల గోపీనాథ్ రెడ్డి, గ్రామ పెద్దలు హేమాద్రి రెడ్డి, కేఎన్ రాజా, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, రెడ్డప్ప తదితర భక్తులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY