బేతవోలు జోరుగా ఎడ్ల పందేలు.. నేటితో ముగిసిన జాతర…
సాక్షిత : చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో రెండు రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్న కనకదుర్గమ్మ జాతర శనివారం ముగిసింది. జాతర సందర్బంగా రెండో రోజు కాంగ్రెస్, సీపీఐ. బీఆర్ఎస్, సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో కోలాట ర్యాలీ, ప్రదర్శనలు చేశారు. దేవాలయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రభలను ఇంటిని తీసుకెళ్ళారు. జాతరతో బేతవోలు గ్రామం కోలహాలంగా మారింది. ప్రతి ఇంట్లో బంధుమిత్రలతో ఇండ్లు కళకళలాడినాయి.జాతర, శివరాత్రి పండుగ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజుల ఎడ్ల పందేలు ముమ్మరంగా జరిగినాయి.
ఎడ్ల పందేలల్లో భాగంగా రెండో రోజు నాలుగు పళ్ల ఎండ్ల విభాగం, ఆరు పళ్ల ఎండ్ల విభాగంలో పందేలు జరిగినాయి. ఆదివారం న్యూ కెటగిరి ఎడ్ల పందేలు జరుగుతాయని నిర్వాహాకులు తెలిపారు. జాతీయ స్థాయి నిర్వహించిన ఎండ్ల పందేలలు చూసేందుకు బేతవోలు గ్రామంతో పాటు చుట్టు ప్రక్కల రైతులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వట్టికూటి నాగయ్య, ఉప సర్పంచ్ ఏడు కొండలు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, వివిధ పార్టీల నాయకులు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జాతరలో ఏలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఉండేందుకు చిలుకూరు ఎస్ఐ హనుమాన్ నాయక్ ఆధ్వర్యంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY