గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకే: సీఎం కప్.
గద్వాల జిల్లా సాక్షిత:
ఎర్రవల్లి మండల కేంద్రంలోని,
శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ సీబీఎస్ఈ స్కూల్ నందు జిల్లా స్థాయి బాస్కెట్బాల్ టోర్నమెంట్ సీఎం కప్ క్రీడలను ప్రారంభించారు.
డి.వై.ఎస్.ఓ కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ,
గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకే సీఎం కప్ క్రీడలను ప్రారంభించారని జిల్లాయువజన క్రీడాశాఖ అధికారి అన్నారు.
ప్రారంభమైన జిల్లాస్థాయి బాస్కెట్బాల్ సీఎం కప్ క్రీడలు ఎర్రవల్లి మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ సీబీఎస్ఈ పాఠశాల నందు జిల్లా స్థాయి బాస్కెట్బాల్ టోర్నమెంట్ నిర్వహించరు.
క్రీడాకారులు క్రీడాస్పూర్తిని చాటుతూ పోటీల్లో పాల్గొనాలని అన్నారు.
మరో అతిథి శ్రీనివాసులు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ,
గ్రామ స్థాయి నుంచి క్రీడాకారులు ప్రపంచ స్థాయికి ఎదగాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఈ క్రీడలను నిర్వహిస్తుందని అన్నారు అందులో భాగంగానే ప్రతి జిల్లాకు ఒక క్రీడాకారులను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని అన్నారు.
ఈ పోటీల్లో జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆయా పాఠశాలల విద్యార్థులు ఎర్రవల్లి శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ పాఠశాల ఆవరణంలో బాస్కెట్బాల్ క్రీడలను ఘనంగా నిర్వహించరు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడ అధికారి కృష్ణయ్య, శ్రీనివాసులు ఎర్రవల్లి శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ సీబీఎస్ఈ స్కూల్ చైర్మన్ శ్రీ వీర గోవర్ధన్ రెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, పి.డి నగేష్ బాబు, సతీష్, బషీర్ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY