ఇటుక బట్టీల మీద మైనింగ్ శాఖ కు గతంలో పెట్టిన ఆర్ టీ ఐ
సాక్షిత :ఇటుక బట్టీల పైన దుండిగల్ లో గతంలో పెట్టిన కంప్లైంట్ కి వారు మైనింగ్ శాఖ అనుమతులు ఉన్నాయో లేదో మాకు తెలీదు మేము దాని గురించి విచారించి చర్యలు చేపడతాము అని చెప్పగా ఆర్ టీ ఐ ద్వారా మైనింగ్ శాఖను కోరడమైనది దానికి మైనింగ్ శాఖ వారు దుండిగల్ పరిధిలో ఎక్కడ ఎటువంటి మైనింగ్ గాని మట్టి తవాకాలకి గాని, ట్రాన్స్పోరటేషన్ గాని అనుమతులు ఇవ్వలేదు అని తెలిపారు, అసలు ఇటుక బట్టీలకు మట్టి ఎక్కడి నుంచి వస్తుంది ఇటుకల తయారీ కోసం, ట్రాన్స్పోరటేషన్ అనుమతులు లేకుండా మట్టి ఎలా రవాణా జరుగుతుంది,మైనింగ్ శాఖ ఆ సంబందించిన కాపీలను దుండిగల్ కార్యాలయానికి కూడా పంపారు, ఇలాంటి అక్రమ రవాణా వల్ల రోడ్లు పాడైపోతాయి, ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచి దుండిగల్ ఇటుక బట్టీల వరకు దారి పొడవున వాయు కాలుష్యం, మాకు సదరు మైనింగ్ శాఖ నుంచి కాపీ అందగానే మేము దుండిగల్ మున్సిపల్ కార్యాలయం వారిని సంప్రదించడం జరిగింది దానికి వారు చర్యలు చేపడతాము అని చెప్పి కొంత కాలం గడిపారు తరువాత మళ్ళీ మళ్ళీ వారిని సంప్రదించక వాళ్ళు మేము దీనిని హైడ్రా కి అప్పగిస్తాము అన్నారు కాని అధికారులు ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదు హైడ్రా కి కూడా పంపినట్టు లేరు, ఇప్పటికైనా ఇటుక బట్టీల పైన చర్యలు చేపడతారో లేక హైడ్రా కి అప్పగిస్తారో లేక మీరే హైడ్రా కి కంప్లైంట్ చేసుకోండి అంటారో వేచి చూడాలి మరి?

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY