టీటీడీకి “కుప్పాల” ఫ్యామిలీ రూ.10లక్షల విరాళం
** గోసంరక్షణ ట్రస్ట్ కు వాడాలని విజ్ఞప్తి
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: “ధర్మో రక్షతి రక్షితః”…. అంటూ చెప్పే వాక్యానికి నిజ రూపంలో సార్థకత చేకూర్చే క్రమంలో తిరుపతి “కుప్పాల” వంశానికి చెందిన కుటుంబ సభ్యులు ఆధ్యాత్మిక విరాళాలు, అభాగ్యులకు తోచిన సాయం చేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అందులో భాగంగానే రైల్వేలో వీఆర్ఎస్ తీసుకున్న అధికారి కుప్పాల గిరిధర్ కుమార్ ఇటీవలే టీటీడీకి లక్షల్లో విరాళం ఇచ్చారు. అదే క్రమంలో తండ్రికి తగ్గ తనయుడిలా ఇప్పుడు ఆయన కుమారుడు కుప్పాల నీలేష్ కుమార్ టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ కు రూ. 10,00,116 విరాళాన్ని అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి అందించారు. కాగా కుప్పాల గిరిధర్ కుమార్ తిరుపతిని “బాలాజీ రైల్వే డివిజన్”గా సాధించే సాధన సమితి కన్వీనర్ గా ఉండడం మరో విశేషం.
ఈ మేరకు విరాళం డిడిని టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కి తిరుపతిలోని అడిషనల్ ఈవో నివాస గృహంలో నీలేష్ కుమార్ అందజేశారు.
ఈ సందర్భంగా దాత కుప్పాల నీలేష్ కుమార్ ను అడిషనల్ ఈవో అభినందించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY