కొండవీడు ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన ఎడ్లపాడు మండల తహసీల్దార్, మరియు సిబ్బందిని ఘనంగా సన్మానించిన బీజేపీ నాయకులు
ఎడ్లపాడు మండలం లో ఈ నెల 7,8 తేదీలలో కొండవీడు పరిసరాల లో కొండవీడు ఫెస్ట్ ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించారు.ఈ ఉత్సవాలు తిలకించటానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకులు, స్థానికులు వేలాదిగా పాల్గొన్నారు. కొండవీడు చరిత్ర ప్రతిబింభించే విధంగా గా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల
స్థానిక mla ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
ఇంతటి మహాత్తరమైన కార్యక్రమాన్ని చాలా గొప్పగా విజయవంతం చేసినందుకు స్థానిక ఎడ్లపాడు మండల తహసీల్దార్ జెట్టి విజయశ్రీ మరియు డిప్యూటీ తహసీల్దార్ నారబోయిన అనురాధ
ఆర్ ఐ ముప్పాళ్ల సుబ్బారావు లను
బీజేపీ పార్టీ నాయకులు ఘనంగా సన్మానం చేసి విధులు నిర్వహించిన అధికారులు అందరికీ అభినందనలు తెలియజేసారు ఈ కార్యక్రమం లో
బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు తులాబందుల సత్యనారాయణ
ప్రధాన కార్యదర్శి
దాట్ల వెంకటేశ్వరరాజు
మండల ఉపాధ్యక్షులు అయిలవరపు రామారావు,
యడ్లపాటి హనుమంత్ రాయుడు
SC మోర్చా అధ్యక్షులు బందెల శ్రీనివాసరావు
మండల కార్యదర్శి
నేలటూరి ఏసురత్నం మొదలగు వారు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY