ప్రజల కోసమే జీవించిన మహానాయకుడు, పీడిత వర్గాల పక్షాన అండగా నిలిచిన ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బండారి రాజిరెడ్డి సేవామయమైన రాజకీయ ప్రస్థానం తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుందని వారు తెలిపారు.
దివంగత నేత ,ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి గారి 79 వ జయంతి సందర్భంగా BRS పార్టీ సీనియర్ నాయకులు బోసాని పవన్ కుమార్ ఆధ్వర్యంలో
రామంతపూర్ ప్రభుత్వ పాఠశాల ( ZPHS)లో విద్యార్థులకు ఎగ్జామినేషన్ కిట్ లు పంపిణీ చేయడం జరిగింది.
స్వర్గీయ బండారి రాజిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాసేవే లక్ష్యంగా నిరంతరం కృషి చేసిన బండారి రాజిరెడ్డి చూపిన మార్గమే తమకు దారిదీపమని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి
• దయాకర్ రెడ్డి
• మహేందర్ ముదిరాజ్
• గణేష్ యాదవ్
• ప్రశాంత్ గౌడ్
• ఆనంద్ యాదవ్
• టోనీ రాపోల్
• శ్రీను
• మల్లేష్
• ఆకాశ్
• సునీల్
BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
