ప్రజల కోసమే జీవించిన మహానాయకుడు, పీడిత వర్గాల పక్షాన అండగా నిలిచిన ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బండారి రాజిరెడ్డి సేవామయమైన రాజకీయ ప్రస్థానం తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
79వ జయంతి సందర్భంగా నాచారం సాధన అనాధ ఆశ్రమంలో రోడ్ నెంబర్ – 6 లో వంగేటి సంజీవ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేయడం జరిగింది.
స్వర్గీయ బండారి రాజిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాసేవే లక్ష్యంగా నిరంతరం కృషి చేసిన బండారి రాజిరెడ్డి చూపిన మార్గమే తమకు దారిదీపమని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మల్లాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
